
గాయత్రీ మంత్రము ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యమ్ భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్ AUM BHOOR BHUWAH SWAHA TAT SAVITUR VARENYAM BHARGO DEVASAYA DHEEMAHI DHIYO YO NAHA PRACHODAYAT న గాయత్ర్యాః పరంమంత్రం నమాతుః పరదైవతమ్ అనునది సుప్రసిద్ధమైన వృద్ధవచనము - అనగా తల్లిని మించిన దైవము లేదు. గాయత్రిని మించిన మంత్రము లేదు అని భావము. గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదములో చెప్పబడింది. గాయత్రి అనే పదము 'గయ' మరియు 'త్రాయతి' అను పదములతో కూడుకుని ఉన్నది. "గయాన్ త్రాయతే ఇతి గాయత్రీ" అని ఆదిశంకరులవారు తనభాష్యములో వివరించారు. 'గయలు' అనగా ప్రాణములు అని అర్థము. 'త్రాయత...